Lottery: లక్కీ ఫెలో.. లాటరీ టిక్కెట్ కొన్న గంటకే దక్కిన రూ. కోటి

Punjab man wins one crore lotters an hour after buying ticket
  • పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలో వెలుగు చూసిన ఘటన
  • ఒక్కోటి రూ.6 చొప్పున 25 లాటరీ టిక్కెట్లు కొన్న బ్యాంకు ఉద్యోగి
  • ఆ తరువాత గంటకే రూ. కోటి గెలుచుకున్నట్టు లాటరీ ఏజెంట్ నుంచి ఫోన్
  • ఉద్యోగికి పట్టరాని సంతోషం
లాటరీ టిక్కెట్ కొన్న గంటకే ఓ వ్యక్తి కోటి రూపాయలు గెలుచుకున్నాడు. పంజాబ్‌లో తాజాగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. గురుదాస్‌పూర్ జిల్లాకు చెందిన రూపీందర్‌జిత్ సింగ్ అగ్రికల్చర్ డెవలెప్‌మెంట్ బ్యాంకులో క్లర్క్‌గా పనిచేస్తుంటారు. ఆయన ఏడాదిగా లాటరీ టిక్కెట్లు కొంటూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 

శనివారం మధ్యాహ్నం ఎప్పటిలాగే రూపీందర్‌జిత్ సింగ్ నాగాల్యాండ్ లాటరీ టిక్కెట్లు ఒక్కోటి రూ.6 పెట్టి 25 కొన్నారు. ఆ తరువాత ఆఫీసుకెళ్లి తన పనిలో నిమగ్నమైపోయారు. కానీ గంట తరువాత ఆయనకు లాటరీ ఏజెంట్ నుంచి ఫోన్ వచ్చింది. ఆయన ఏకంగా రూ. కోటి గెలుచుకున్నట్టు ఏజెంట్ చెప్పాడు. దీంతో, రూపీందర్ సంబరం అంబరాన్నంటింది. ఈ డబ్బును తన పిల్లలు, కుటుంబం భవిష్యత్తు కోసం ఖర్చు చేస్తానని ఆయన చెప్పారు.
Lottery
Punjab

More Telugu News