Maharashtra: ‘మహా’ పరిణామం.. శరద్‌పవార్‌‌ను కలిసిన అజిత్ పవార్!

NCP Rebel Camps Shock Meet With Sharad Pawar
  • ముంబయిలో శరద్‌పవార్‌‌తో అజిత్‌, ప్రఫుల్‌ పటేల్‌, భుజ్‌బల్‌ తదితరుల భేటీ
  • ఎన్సీపీలో తిరుగుబాటు తర్వాత తొలిసారి కలిసిన బాబాయ్ అబ్బాయ్
  • పార్టీ కలిసి ఉండాలని శరద్‌ను కోరామన్న ప్రఫుల్ పటేల్

మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల ఎన్సీపీలో తిరుగుబాటు చేసిన అజిత్‌ పవార్‌ వర్గం.. ఆ పార్టీ అధినేత శరద్‌ పవార్‌ను కలిసింది. ముంబయిలో జరిగిన ఈ భేటీలో డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్, ప్రఫుల్‌ పటేల్‌, ఛగన్‌ భుజ్‌బల్‌, దిలీప్‌ పాటిల్‌ తదితరులు పాల్గొన్నారు. 


ఎన్సీపీలో తిరుగుబాటు తర్వాత చీలిక వర్గం నేతలు శరద్‌పవార్‌‌ను కలవడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా ప్రఫుల్‌ పటేల్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ రోజు మా దేవుడు, మా నాయకుడిని కలిశాం. శరద్‌పవార్‌ ఆశీస్సుల కోసమే వచ్చాం” అని తెలిపారు.  

‘‘మేం ఎలాంటి అపాయింట్‌మెంట్ అడగకుండానే వచ్చాం. శరద్ పవార్ ఇక్కడికి ఓ మీటింగ్ కోసం వచ్చారని తెలుసుకుని.. మేమూ వచ్చాం. తామంతా ఆయన్ను చాలా గౌరవిస్తామని, ఎన్సీపీ కలిసి ఉండాలని చెప్పాం. దీని గురించి సరిగ్గా ఆలోచించి భవిష్యత్తులో తమకు సహాయం చేయాలని అభ్యర్థించాం. కానీ శరద్ పవార్ మాకు సమాధానం ఇవ్వలేదు.. కేవలం మేము చెప్పింది విన్నారు” అని వివరించారు.

  • Loading...

More Telugu News