USA: అమెరికాలో మళ్లీ కాల్పులు..నలుగురి మృతి

4 people killed in shooting in Georgia hunt on for suspect
  • జార్జియా రాష్ట్రంలోని హాంప్టన్ నగరంలో వెలుగు చూసిన ఘటన
  • శనివారం ఉదయం తుపాకీతో కాల్పులకు తెగబడ్డ నిందితుడు
  • పరారీలో ఉన్న దుండగుడి కోసం పోలీసులు విస్తృత గాలింపు
  • అతడి ఆచూకీ తెలిపిన వారికి పది వేల డాలర్ల రివార్డు ప్రకటన

అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం రేగింది.  జార్జియా రాష్ట్రంలోని హాంప్టన్ నగరంలో ఓ వ్యక్తి శనివారం ఉదయం విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడటంతో ముగ్గురు పురుషులు, ఓ మహిళ దుర్మరణం చెందారు. 

నిందితుడిని ఆండ్రే లాంగ్‌మోర్‌గా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న అతడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి పది వేల డాలర్లు రివార్డును హాంప్టన్ పోలీసు అధికారి ప్రకటించారు. నిందితుడు అత్యంత ప్రమాదకారి అని, అతడి వద్ద ఆయుధం ఉందని పోలీసులు హెచ్చరించారు.  ‘‘నువ్వు ఏ మూల దాక్కున్నా వెంటాడి అరెస్ట్ చేస్తాం’’ అని హెచ్చరించారు. 

అమెరికాలో ఈ ఏడు ఇలాంటి కాల్పుల ఘటన జరగడం ఇది 31వ సారి. ఇప్పటివరకూ అక్కడ 153 మంది తూటాలకు బలయ్యారు. 8500 మంది జనాభా కలిగిన హాంప్టన్ నగరం నాస్కార్(కారు రేసులు) ఈవెంట్స్‌కు పేరు గాంచింది. అక్కడ ఓ మోటార్ స్పీడ్ వే కూడా ఉంది.

  • Loading...

More Telugu News