PV Sindhu: అదే ప్రత్యర్థి చేతిలో మళ్లీ క్వార్టర్‌‌ ఫైనల్లోనే ఓడిన సింధు

PV Sindhu goes down to her nemesis chinas Gao Fang Jie at us open
  • యూఎస్‌ ఓపెన్‌లో సింధుకు చుక్కెదురు
  • ఈ ఏడాది ఒక్క టైటిల్‌ నెగ్గని తెలుగమ్మాయి
  • సెమీస్‌ చేరిన లక్ష్యసేన్
భారత స్టార్ షట్లర్, తెలుగమ్మాయి పీవీ సింధు మరోసారి నిరాశ పరిచింది. ఈ ఏడాది ఒక్క టైటిల్ కూడా నెగ్గని సింధు తాజాగా యూఎస్‌ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగింది. తనకంటే తక్కువ ర్యాంకర్ అయిన చైనాకు చెందిన జావో ఫెంగ్ జియె చేతిలో గత నాలుగు మ్యాచ్‌ల్లో మూడోసారి ఓడిన సింధు ఇంటిదారి పట్టింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సింధు 20–22, 13–21తో ఫెంగ్‌ చేతిలో వరుస గేమ్స్‌లో పరాజయం పాలైంది. 

అయితే, పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. క్వార్టర్స్‌లో అతను 21–10, 21–17తో భారత్‌కే చెందిన శంకర్ ముత్తుస్వామిపై వరుస గేమ్స్‌లో విజయం సాధించాడు. గతవారం కెనడా ఓపెన్‌ నెగ్గిన లక్ష్యసేన్ మరో టైటిల్ కు చేరువయ్యాడు.
PV Sindhu
us open
lose
laksyasen

More Telugu News