Infinix: తక్కువ ధరలో 5జీ స్మార్ట్ ఫోన్

Infinix Launches new smart phone Infinix hot 30 5g features and price details
  • సరికొత్త మొబైల్ ను లాంచ్ చేసిన ఇన్‌ఫినిక్స్‌
  • హాట్ 30 పేరుతో రూ.12 వేలకే లభ్యం  
  • ఈ నెల 18 నుంచి ఫ్లిప్ కార్ట్ లో అమ్మకాలు
ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ఇన్‌ఫినిక్స్‌ సరికొత్త 5జీ స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇన్‌ఫినిక్స్‌ హాట్ 30 పేరుతో లాంచ్ చేసిన ఈ ఫోన్ ను అతితక్కువ ధరకే వినియోగదారులకు అందించనున్నట్లు పేర్కొంది. అదిరిపోయే ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్ తో తయారుచేసిన ఈ స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ.12 వేలకే సొంతం చేసుకోవచ్చని చెబుతోంది.

ఇటీవల వరుసగా బడ్జెట్‌ ఫోన్‌లను విడుదల చేస్తున్న ఇన్‌ఫినిక్స్‌ తాజాగా విడుదల చేసిన హాట్ 30 ఫోను అమ్మకాలను జులై 18 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభించనున్నట్లు తెలిపింది. 4జీబీ ర్యామ్‌ 128 జీబీ స్టోరేజ్‌ ధర రూ.12,499 కాగా, 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ధర రూ.13,499 గా నిర్ణయించింది. దీనికి అదనంగా యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ తో కొనుగోలు చేస్తే రూ.1000 ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ లభిస్తుందని కంపెనీ వివరించింది.

హాట్ 30 ఫీచర్లు ఇవే..
  • 6.78 ఇంచెస్‌ ఫుడ్‌ హెచ్‌డీ డిస్‌ప్లే
  • 120Hz రిఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్‌ 
  • మీడియా టెక్‌ డైమెన్సిటీ 6020 SoC ప్రాసెసర్‌
  • ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌
  • 18 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 6000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ
  • 50 మెగా పిక్సెల్‌ రియర్‌ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్‌ కెమెరా
Infinix
5g smart phone
hot 30 5g
New Launche
Business

More Telugu News