Volcano Pizza: అగ్నిపర్వతంపై పిజ్జా వండుకుంటే ఇలా ఉంటుంది!

Woman Eats Pizza Cooked On Guatemalas Active Volcano
  • గ్వాటెమాలా సందర్శనకు వెళ్లిన మహిళ
  • అక్కడి పాకాయా అగ్నిపర్వతంపై వండిన పిజ్జాను రుచి చూసిన వైనం
  • పర్యటన విశేషాలు నెట్టింట్లో షేర్
  • వీడియో వైరల్
సాధారణంగా ఎవరైనా పొయ్యి మీద వంట చేసుకుంటారు. కట్టెల పొయ్యి, గ్యాస్ పొయ్యి లేదా మైక్రోవేవ్ ఓవెన్‌లో వండుకుంటారు. కానీ లావా ఎగజిమ్మే అగ్నిపర్వతం సాయంతో వండిన పిజ్జాను ఓ మహిళ లొట్టలేసుకుంటూ తినేసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.  

అలెగ్జాండ్రా బ్లాడ్జెట్ అనే మహిళ ఇటీవల గ్వాటెమాలాలోని పాకాయా అగ్నిపర్వతాన్ని సందర్శించింది. ఇది క్రియాశీలకంగా ఉన్న అగ్నిపర్వతం. అంటే అప్పుడప్పుడు లావా ఎగజిమ్ముతూ ఉంటుందన్నమాట. 2021లో చివరిసారిగా ఇందులోంచి లావా ఎగసిపడింది. 

అయితే, తన పర్యటనలో కొత్తగా ఏదైనా చేయాలనుకున్న అలెగ్జాండ్రా అగ్నిపర్వతంలో వండిన పిజ్జాను రుచి చూసింది. అక్కడి గైడ్ ఒకరు పచ్చి పిజ్జాను ఓ ట్రేలో పెట్టి దాన్ని అగ్నిపర్వతంపై ఉన్న చిన్న గొయ్యిలో పెట్టింది. ఆ తరువాత దానిపై రాళ్లు పేర్చింది. గొయ్యిలోని వేడి కారణంగా పిజ్జా చక్కగా ఉడికింది. అలెగ్జాండ్రా ఆ పిజ్జాను ఎంజాయ్ చేస్తూ ఆరగించింది. ఇక్కడకు రావాలంటే గైడ్ ఉండాలని చెప్పిన అలెగ్జాండ్రా ముందుగానే అన్ని ఏర్పాట్లు పక్కాగా చేసుకుని అగ్నిపర్వతం సందర్శనకు రావాలని సూచించింది. వైరల్ వీడియో కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
Volcano Pizza
Viral Videos

More Telugu News