భారత క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికా పర్యటన షెడ్యూల్ ఇదే
- దక్షిణాఫ్రికా పర్యటనలో మూడు ట్వంటీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్ట్‌లు
- డిసెంబర్ 10న ట్వంటీ 20తో పర్యటన ప్రారంభం
- వచ్చే ఏడాది జనవరి 3 నుండి 7 మధ్య రెండో టెస్ట్‌తో ముగింపు
డిసెంబర్ 10 డర్బన్ లో, 12న గెబెర్హాలో, 14న జోహెన్నస్‌బర్గ్‌లో మూడు ట్వంటీ 20 మ్యాచ్ లు జరగనున్నాయి. డిసెంబర్ 17న జోహెన్నస్‌బర్గ్ లో, 19న గెబెర్హాలో, 21న పార్ల్ లో మూడు వన్డేలు జరుగుతాయి. ఆ తర్వాత డిసెంబర్ 26 నుండి 30 వరకు తొలి టెస్ట్, వచ్చే ఏడాది జనవరి 3 నుండి 7వ తేదీ వరకు రెండో టెస్ట్ జరగనున్నాయి.