Virat Kohli: బ్రాత్ వైట్ ఇటుకలు విసిరినట్లుగా బౌలింగ్ చేస్తున్నాడు: స్టంప్ మైక్ లో కోహ్లీ వ్యాఖ్యలు

Virat Kohli Accuse Windies Star Of Illegal Bowling Action
  • విండీస్ కెప్టెన్ బౌలింగ్‌పై యశస్వితో విరాట్ కోహ్లీ వ్యాఖ్యలు
  • బ్రాత్ వైట్ బౌలింగ్ యాక్షన్‌పై గతంలోను అనుమానాలు
  • బౌలింగ్ యాక్షన్ నిబంధనల ప్రకారమే ఉన్నట్లు ఐసీసీ స్పష్టీకరణ
డొమినికాలో వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ రెండో రోజు మ్యాచ్ లో భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ విండీస్ కెప్టెన్ బ్రాత్ వైట్ బౌలింగ్‌పై అసహనం వ్యక్తం చేశారు. బ్రాత్ వైట్ బౌలింగ్ పై చేసిన వ్యాఖ్యలు స్టంప్ మైక్ లో వినిపించినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ మ్యాచ్ లో కోహ్లీ నిలకడగా ఆడాడు. విండీస్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. తాను ఎదుర్కొన్న 81వ బంతికి కోహ్లీ బౌండరీ సాధించాడంటే అర్థం చేసుకోవచ్చు. అయితే రెండో రోజు ఆట సందర్భంగా కోహ్లీ విండీస్ కెప్టెన్ బౌలింగ్ పై అసహనం వ్యక్తం చేశారు.

క్రీజులో ఉన్న యశస్వి జైపాల్ తో కోహ్లీ మాట్లాడుతూ... అతను ఇటుకలు విసిరినట్లుగా బౌలింగ్ చేస్తున్నాడు అని బ్రాత్ వైట్ ను ఉద్దేశించి అన్నారు. బ్రాత్ వైట్ బౌలింగ్ పై గతంలోను అనుమానాలు తలెత్తాయి. 2019లో విండీస్ పర్యటనకు వెళ్లినప్పుడు భారత అటగాళ్లు ఇలాంటి ఆరోపణలు చేశారు. అంతకుముందు 2017లోనూ చేశారు. అయితే ఆ రెండు సందర్భాలలోను ఐసీసీ మాత్రం బ్రాత్ వైట్ బౌలింగ్ యాక్షన్ నిబంధనలకు అనుగుణంగానే ఉన్నట్లు స్పష్టం చేసింది. బ్రాత్ వైట్ బౌలింగ్ పై జైస్వాల్ తో వ్యాఖ్యలు చేసిన కోహ్లీ ఫిర్యాదు మాత్రం చేయలేదు.
Virat Kohli
Team India
Cricket
west indies

More Telugu News