35 రోజుల క్రితం చనిపోయిన ఎస్సై ప్రభాకర్ రెడ్డికి ట్రాన్స్ ఫర్ ఆర్డర్స్!
- సైబరాబాద్ పరిధిలో 83 మంది ఎస్సైల బదిలీ
- జాబితాలో ప్రభాకర్ రెడ్డి పేరు
- తప్పును సరిదిద్ది మరోసారి జాబితాను విడుదల చేసిన ఉన్నతాధికారులు
తాజాగా సైబరాబాద్ పరిధిలో ఎస్సైలను బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 83 మంది ఎస్సైలను బదిలీ చేశారు. ఈ జాబితాలో ప్రభాకర్ రెడ్డి పేరు కూడా ఉంది. ఆయనను జీనోమ్ వ్యాలీ పీఎస్ కు బదిలీ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ విషయం వాట్సాప్ గ్రూపుల్లో బాగా షేర్ అయింది. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. పాత జాబితాను సరిదిద్ది, అందులో నుంచి ప్రభాకర్ రెడ్డి పేరును తొలగించారు. కొత్త జాబితాతో మరోసారి ఉత్తర్వులను జారీ చేశారు.