Aishwarya Rajinikanth: రెండో పెళ్లికి రెడీ అవుతున్న రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య?

talk of Aishwarya Rajnikanth second marriage goes viral in Tamil film industry
  • ఐశ్వర్య ఓ నటుడితో రిసార్ట్‌ వద్ద కనిపించినట్టు వార్త వైరల్
  • దీంతో, రెండో పెళ్లి వదంతులు మొదలు
  • గతేడాది భర్త ధనుష్‌కు విడాకులు ఇచ్చిన ఐశ్వర్య
  • ప్రస్తుతం పిల్లలతో కలిసి విడిగా ఉంటున్న వైనం
ప్రముఖ నటుడు రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రెండో పెళ్లి అంశం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల ఓ హీరోతో ఆమె సన్నిహితంగా కనిపించడంతో రెండో పెళ్లి అంశం తెరపైకి వచ్చిందని అక్కడి వర్గాలు చెబుతున్నాయి. ఓ రిసార్ట్‌ వద్ద ఆమె అతడితో కనిపించినట్టు సమాచారం. ఈ వార్తలో నిజమెంతో తెలియనప్పటికీ సినీ అభిమానుల దృష్టి మరోసారి ఐశ్వర్యపై పడింది. 
 గతేడాది ఐశ్వర్య, నటుడు ధనుష్‌కు విడాకులు ఇచ్చేసిన విషయం తెలిసిందే. 18 ఏళ్ల వైవాహిక బంధానికి వారు ముగింపు పలికారు. ప్రస్తుతం ఆమె తన ఇద్దరు పిల్లలతో కలిసి విడిగా ఉంటోంది. ఐశ్వర్య, ధనుష్ మళ్లీ ఒక్కటికానున్నారన్న వార్త ఇటీవల వైరల్ అయినా వారు మాత్రం ఈ విషయమై మౌనాన్నే ఆశ్రయించారు. తాము ఎందుకు విడిపోయిందీ ఐశ్వర్య, ధనుష్ ఇప్పటివరకూ బయటపెట్టలేదు. అయితే సుచీ లీక్స్‌లో ధనుష్ ఫొటో బయటకు వచ్చిన నాటి నుంచీ వారి మధ్య విభేదాలు మొదలయ్యాయని టాక్. అవి ముదిరి చివరకు విడాకులకు దారి తీశాయట.
Aishwarya Rajinikanth
Rajinikanth
Kollywood
Dhanush

More Telugu News