Madhya Pradesh: పండంటి కాపురాన్ని కూల్చిన టమాటా.. ఇల్లు వదిలి వెళ్లిపోయిన ఇల్లాలు

Madhya Pradesh man uses tomatoes to cook without asking wife she leaves home
  • మధ్యప్రదేశ్‌లోని షాడోల్ జిల్లాలో వెలుగు చూసిన ఘటన
  • భార్యకు తెలియకుండా వంటలో టమాటాలు వాడి చిక్కుల్లో పడ్డ భర్త
  • విషయం తెలిసి భర్తతో గొడవపడ్డ మహిళ
  • తీవ్ర ఆగ్రహంతో పిల్లలను తీసుకుని ఇల్లు వీడిన వైనం
  • ఆమె కోసం ఎంత వెతికినా ఉపయోగం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించిన యువకుడు

ఆకాశాన్నంటుతున్న టమాటా ధరలు సామాన్యుల జేబులకు చిల్లులు పెట్టడమే కాకుండా కాపురాలు కూడా కూల్చేస్తున్నాయి. భార్యకు తెలియకుండా వంటలో రెండు టమాటాలు వాడిన ఓ వ్యక్తి కాపురం కూలిపోయింది. భర్తపై మండిపడ్డ ఆ ఇల్లాలు తన పిల్లల్ని తీసుకుని ఇంట్లోంచి వెళ్లిపోయింది. మధ్యప్రదేశ్‌లోని షాడోల్ జిల్లాలో తాజాగా ఈ ఘటన వెలుగు చూసింది. 

సంజీవ్ బర్మన్ అనే వ్యక్తి స్థానికంగా ఓ టిఫిన్ సెంటర్ నిర్వహిస్తూ పొట్టపోసుకుంటున్నాడు. అతడికి భార్య, పిల్లలు ఉన్నారు. ఇటీవల అతడు తన భార్యకు చెప్పకుండా వంటలో రెండు టమాటాలు వినియోగించాడు. ఆ తరువాత విషయం తెలిసి భార్య అతడిపై అగ్గిమీద గుగ్గిలమైంది. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. ఈ క్రమంలో ఆమె తన పిల్లల్ని తీసుకుని ఇంట్లోంచి వెళ్లిపోయింది. భార్య కోసం చుట్టుపక్కల వెతికినా ఉపయోగం లేకపోవడంతో సంజీవ్ చివరకు పోలీసులను ఆశ్రయించాడు.

  • Loading...

More Telugu News