కోల్‌కతా రైలులో జుట్టు పట్టుకొని చెప్పులతో కొట్టుకున్న మహిళలు
- జులై 11న ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఆయుషి
- వైరల్ గా మారిన మహిళలు కొట్టుకున్న వీడియో
- కొంతమంది ఆపేందుకు ప్రయత్నించి విఫలం
లోకల్ రైలులోని లేడీస్ కంపార్టుమెంట్ లో మహిళలు గొడవ పడుతున్నట్లుగా ఈ వీడియోలో ఉంది. ఆ మహిళలు అరవడం, కేకలు వేయడం.. ఒకరిపై మరొకరు చెప్పులతో, పిడికిలి బిగించి కొట్టుకోవడం ఆ వీడియోలో ఉంది. ఒకరి జుట్టును మరొకరు లాగుతున్నట్లుగా కూడా వీడియోలో ఉంది. వారి ప్రవర్తనను చూసిన కొంతమంది ఆపడానికి ప్రయత్నించినప్పటికీ ఎవరూ వినలేదు. రైలులో ఈ గొడవకు గల కారణాలు వెల్లడి కాలేదు.
ఈ ఘటనపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. రైలులో ఉచిత డబ్ల్యుడబ్ల్యుఈ అని ఒకరు, క్లినిక్ ప్లస్ న్యూ యాడ్ అని మరొకరు, గతంలో ముంబైలోనూ ఇలాంటి సంఘటన జరిగిందని ఇంకో నెటిజన్ కామెంట్లు పెట్టారు.