Mahesh Babu: మహేశ్ బాబు కుటుంబం ప్రచారం చేస్తున్న రియల్ ఎస్టేట్ సంస్థపై కేసు

A case booked  against the real estate company promoted by Mahesh Babu
  •  సాయి సూర్య డెవలపర్స్‌ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న మహేశ్ 
  • ప్లాట్స్ పేరుతో డబ్బులు కట్టించుకుని ఎగ్గొట్టిందని పోలీసులను ఆశ్రయించిన బాధితులు
  • కేసు నమోదు చేసిన మధురానగర్ పోలీసులు
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు చిక్కుల్లో పడేలా ఉన్నారు. ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ఓ రియల్ ఎస్టేట్ సంస్థపై కేసు నమోదు అయ్యింది. శ్రీ సాయి సూర్య డెవలపర్స్‌ అనే రియల్ ఎస్టేట్ సంస్థకు ప్రచారం చేస్తున్నారు. ఆ సంస్థ ప్లాట్స్ పేరుతో డబ్బులు కట్టించుకుని ఎగ్గొట్టిందని ఆరోపిస్తూ పలువురు పోలీసులను ఆశ్రయించారు. 30 మంది బాధితులు ఫిర్యాదు చేశారు. 

ఈ మేరకు సాయి సూర్య డెవలపర్స్‌పై సెక్షన్‌ 406, 420 కింద మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రకటనలు చూసి మోసపోయామని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. సాయి సూర్య డెవలపర్‌ సంస్థ అధినేత సతీష్ చంద్ర గుప్తాపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, సూర్య డెవలపర్స్‌ కోసం మహేశ్ తన భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితారతో కలిసి వ్యాపార ప్రకటనల్లో నటించారు.
Mahesh Babu
real estate company
case

More Telugu News