tmc: బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో మమతా పార్టీ జోరు, రెండో స్థానంలో బీజేపీ

West Bengal Panchayat Election Result 2023
  • 18వేలకు పైగా పంచాయతీల్లో టీఎంసీ గెలుపు!
  • 4,592 స్థానాలతో రెండో స్థానంలో బీజేపీ
  • తేలిపోయిన కాంగ్రెస్, సీపీఐ(ఎం)
పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ సత్తా చాటుతోంది. సాయంత్రం ట్రెండ్స్ ప్రకారం 63,229 గ్రామ పంచాయతీలకు గాను టీఎంసీ 18,332 పంచాయతీల్లో, బీజేపీ 4,592, కాంగ్రెస్ 1,142, సీపీఐ(ఎం) 1,894 పంచాయతీల్లో గెలుపు లేదా ముందంజలో కొనసాగుతున్నాయి. పంచాయతీ సమితిల విషయానికి వస్తే టీఎంసీ 134, బీజేపీ 8, సీపీఎం 6 స్థానాల్లో, జిల్లా పరిషత్‌లలో టీఎంసీ 22, సీపీఎం 1 స్థానంలో ముందంజలో ఉన్నాయి. 63వేలకు పైగా గ్రామపంచాయతీలకు గాను 28వేల పంచాయతీల సమాచారం మాత్రమే ప్రస్తుతం వెల్లడైంది. మరో 35వేలకు పైగా గ్రామపంచాయతీల ఓట్లు లెక్కించాల్సి ఉంది.
tmc
Mamata Banerjee
BJP
Congress

More Telugu News