Jam Jam Jajjanaka: జాం జాం జజ్జనక... పూర్తి పాట విడుదల చేసిన భోళాశంకర్ చిత్రబృందం

Jam Jam Jam Jam Jajjanaka full song from Bhola Shankar out now
  • చిరంజీవి హీరోగా మెహర్ రమేశ్ దర్శకత్వంలో భోళాశంకర్
  • మహతి స్వరసాగర్ సంగీతం
  • జాం జాం జజ్జనక గీతానికి కాసర్ల శ్యామ్ సాహిత్యం
  • ఆలపించిన అనురాగ్ కులకర్ణి, మంగ్లీ
  • ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు వస్తున్న భోళాశంకర్
మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో మెహర్ రమేశ్ దర్శకత్వంలో నటించిన భోళాశంకర్ చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. ఈ చిత్రం నుంచి తాజాగా జాం జాం జాం జజ్జనక... తెల్లార్లూ ఆడుదాం తయ్యితక్క అంటూ సాగే పాట పూర్తి వీడియో విడుదలైంది. ఈ సెలబ్రేషన్ సాంగ్ కు మహతి స్వరసాగర్ బాణీలు అందించగా, కాసర్ల శ్యామ్ సాహిత్యం సమకూర్చారు. అనురాగ్ కులకర్ణి, మంగ్లీ ఈ పాటను ఆలపించారు. 

ఏకే ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న భోళాశంకర్ చిత్రం ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో చిరంజీవి సరసన తమన్నా నటిస్తుండగా, చిరంజీవికి చెల్లెలిగా కీర్తిసురేశ్ కీలక పాత్ర పోషిస్తోంది. 

సుశాంత్, తరుణ్ అరోరా, వెన్నెల కిశోర్, మురళీశర్మ, బ్రహ్మాజీ, ఉత్తేజ్, శ్రీముఖి, సితార, హైపర్ ఆది, గెటప్ శ్రీను తదితరులు ఇతర పాత్రధారులు.
Jam Jam Jajjanaka
Bhola Shankar
Chiranjeevi
Meher Ramesh
Mahati Swara Sagar
Kasarla Shyam
AK Entertainments
Tollywood

More Telugu News