JC Prabhakar Reddy: మమ్మల్ని చంపాలని చూస్తే మీ పాడె కడతాం: జేసీ ప్రభాకర్ రెడ్డికి కేతిరెడ్డి వార్నింగ్

Kethireddy warning to JC prabhakar Reddy
  • తమ జోలికి వస్తే ఏం చేయాలో అదే చేస్తామని ఆగ్రహం
  • 2024లో జేసీ కుటుంబానికి రాజకీయంగా సమాధి కడతామని వ్యాఖ్య
  • అందరితో పాటు తనకూ బీమా వచ్చిందని స్పష్టీకరణ

తాడిపత్రి రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మంగళవారం గట్టి హెచ్చరిక జారీ చేశారు. తమ జోలికి వస్తే ఏం చేయాలో అదే చేస్తామని స్పష్టం చేశారు. తమని చంపాలనే ఆలోచన వచ్చినా మీ అంతు చూస్తామని, నా పాడె కాదు.. నీ పాడె కడతాను అంటూ కేతిరెడ్డి వార్నింగ్ ఇచ్చారు. 2024లో జేసీ కుటుంబానికి రాజకీయంగా సమాధి కడతామన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఓ సైకో అని దుయ్యబట్టారు.

అందరితో పాటు తనకూ రైతు బీమా వచ్చిందని, ఇందులో ఏమైనా అవినీతి జరిగితే నిరూపించాలని సవాల్ చేశారు. చీనీ తోటల బీమాపై జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో కేతిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. రైతు బీమాలో అవినీతి జరిగితే నిరూపించాలన్నారు. అంతేకానీ నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు.

  • Loading...

More Telugu News