K Kavitha: రోడ్డు పక్కన మొక్కజొన్న కండెలు చూసి కారాపిన ఎమ్మెల్సీ కవిత

Kavitha bought corn at roadside
  • జగిత్యాల జిల్లాలో పర్యటించిన ఎమ్మెల్సీ కవిత
  • నూకపల్లి గ్రామం వద్ద మొక్కజొన్న కండెల విక్రేతతో మాటామంతీ
  • వేడివేడి మొక్కజొన్న కండెలు కొనుక్కుని లాగించేసిన కవిత
  • కేసీఆర్ పాలన ఎలా ఉందంటూ ఆరా తీసిన వైనం
సీఎం కేసీఆర్ తనయ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రజలతో మమేకం అయ్యేందుకు అత్యధిక ఆసక్తి చూపిస్తుంటారు. బోనాలు కానివ్వండి, బతుకమ్మ కానివ్వండి... ఎలాంటి సందర్భం వచ్చినా ప్రజల మధ్యన ఉండేందుకు ఇష్టపడతారు. 

తన పర్యటనల్లో సామాన్య ప్రజలతో మాట్లాడుతూ వాళ్ల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. మొత్తమ్మీద ప్రజల మనిషిగా ఉండడమే కవితకు నచ్చిన విషయం. 

తాజాగా, ఆమె రోడ్డు పక్కన మొక్కజొన్న కండెలు చూసి కారు ఆపారు. జగిత్యాల జిల్లా పర్యటన సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. మల్యాల మండలం నూకపల్లి శివారులో ఓ మహిళ రోడ్డు పక్కన మొక్కజొన్న కండెలు కాల్చుతోంది. కారు ఆపి ఆ మహిళ వద్దకు వెళ్లిన కవిత మొక్కజొన్న కండెలు కొనుక్కుని వేడివేడిగా లాగించేశారు. 

ఈ సందర్భంగా ఆ మహిళ పేరు (కొమురమ్మ), ఇతర వివరాలను కూడా కవిత సేకరించారు. సీఎం కేసీఆర్ పాలన ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు.
K Kavitha
Corn
Nukapalli
Jagitial
BRS
Telangana

More Telugu News