Virat Kohli: అప్పుడు ఆడిన వాళ్లలో ఇప్పుడీ సిరీస్‌లో భాగమవుతున్నది మేమిద్దరమే: విరాట్ కోహ్లీ

we played at dominica in 2011 virat kohli million dollar post for team india coach rahul dravid
  • మూడు ఫార్మాట్ల సిరీస్‌ల కోసం వెస్టిండీస్‌కు వెళ్లిన టీమిండియా
  • జులై 12న మొదలుకానున్న తొలి టెస్టు
  • 2011లో వెస్టిండీస్‌లో ద్రవిడ్‌తో ఆడటాన్ని గుర్తు చేసుకున్న కోహ్లీ
రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్‌ కోసం వెస్టిండీస్‌ వెళ్లింది టీమిండియా. నెల రోజులపాటు కొనసాగనున్న ఈ టూర్‌‌.. జులై 12న డొమినికా వేదికగా జరిగే తొలి టెస్టుతో మొదలుకానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో ఆసక్తికర విషయం షేర్ చేసుకున్నాడు. 

మాజీ క్రికెటర్, టీమిండియా ప్రధాన కోచ్‌ రాహుల్ ద్రవిడ్‌ తో కలిసి దిగిన ఫొటోను ట్విట్టర్‌‌లో విరాట్ పోస్ట్ చేశాడు. 2011లో వెస్టిండీస్‌లో తామిద్దరం భారత్ తరఫున ఆడిన విషయాన్ని గుర్తుచేసుకున్నాడు. అప్పుడు టీమిండియా తరఫున ఆడి, ప్రస్తుత సిరీస్‌లో భాగం అవుతున్నది విరాట్ కోహ్లీ, ద్రవిడ్‌ మాత్రమే కావడం గమనార్హం.

‘‘2011లో డొమినికాలో మేం చివరి టెస్ట్‌ ఆడాం. అప్పుడు టీమిండియాకు ఆడిన వాళ్లలో ఇద్దరం (రాహుల్ ద్రవిడ్, కోహ్లీ) మాత్రమే ఈ సిరీస్‌లో భాగమవుతున్నాం. ఈ ప్రయాణం మమ్మల్ని విభిన్న సామర్థ్యాలతో ఇక్కడికి తీసుకువస్తుందని ఎప్పుడూ ఊహించలేదు” అని రాసుకొచ్చాడు.
Virat Kohli
Rahul Dravid
West Indies
Team India
Cricket

More Telugu News