US Library: 119 ఏళ్ల తర్వాత లైబ్రరీకి తిరిగి చేరుకున్న పుస్తకం

Overdue Book Returned To US Library 119 Years Later
  • అమెరికాలోని మసాచుసెట్స్ లైబ్రరీలో విచిత్రం
  • 1904 లో ఓ మెంబర్ తీసుకెళ్లిన అరుదైన పుస్తకం
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన లైబ్రరీ పోస్టు
అమెరికాలోని మసాచుసెట్స్ లో విచిత్రం చోటుచేసుకుంది. దాదాపు 119 ఏళ్ల క్రితం పబ్లిక్ లైబ్రరీ నుంచి ఓ మెంబర్ తీసుకెళ్లిన అరుదైన పుస్తకం తాజాగా రిటర్న్ వచ్చింది. లైబ్రరీ నుంచి తీసుకెళ్లిన గడువు ముగిసిన పుస్తకాన్ని తిరిగివ్వడంలో ఆలస్యమనేదే ఉండదనే క్యాప్షన్ తో సదరు పుస్తకం ఫొటోను మసాచుసెట్స్ లైబ్రరీ తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

మసాచుసెట్స్ పబ్లిక్ లైబ్రరీ పోస్ట్ ప్రకారం.. విద్యుత్ రంగంలో అభివృద్ధిపై జేమ్స్ క్లర్క్ మాక్స్ వెల్ రాసిన పుస్తకాన్ని 1904లో ఓ మెంబర్ తీసుకెళ్లాడు. ఆ తర్వాత దానిని తిరిగివ్వడం మర్చిపోయాడు. అప్పటి నుంచి పుస్తకం పలువురి చేతులు మారి వెస్ట్ వర్జీనియాలోని ఓ ఛారీటి సంస్థ నిర్వహించే బుక్ స్టాల్ లోకి చేరింది. ఉచితంగా పుస్తకాలను అందించే స్టాల్ లో ఈ పుస్తకంలో మసాచుసెట్స్ లైబ్రరీ స్టాంప్ ను చూసిన రీడర్ ఒకరు దానిని పోస్ట్ ద్వారా పంపించాడు. దీంతో 119 ఏళ్ల తర్వాత పుస్తకం తిరిగి సొంతింటికి చేరుకుంది.
US Library
Overdue Book
Returned
119 Years Later
offbeat

More Telugu News