నువ్వు క్రిమినల్ వి జగన్... నువ్వు పోలీస్ వ్యవస్థను శాసిస్తుంటే ఛీ అనిపిస్తోంది: పవన్ కల్యాణ్
- ఏలూరులో పవన్ కల్యాణ్ సభ
- సీఎం జగన్ పై నిప్పులు చెరిగేలా ప్రసంగం
- ప్రభుత్వం మారాక నీ తప్పులన్నీ బయటికి తీస్తాం అంటూ పవన్ వార్నింగ్
- ఊరూరా తిప్పి సమాధానం చెప్పేలా చేస్తామని స్పష్టీకరణ
"మాట్లాడితే చాలు... ఈ జగన్ నేను హైదరాబాదులో ఉన్నానని అంటాడు. జగన్... నేను మీ నాన్నగారిలా ప్రాజెక్టుల మీద 6 శాతం కమీషన్ దోచుకోలేదు. సీఎం పదవి చాటున వేల కోట్లు దోచుకోలేదు. నేను సామాన్య కుటుంబం నుంచి వచ్చాను జగన్. సినిమాల్లో సంపాదించిన డబ్బును కౌలు రైతులు ఖర్చు పెడుతున్నాను" అని స్పష్టం చేశారు.
అసలు, ఈ ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. "ప్రశ్నిస్తారనే ప్రెస్ మీట్లు పెట్టడంలేదు. ఓ రాణిలా పరదాల చాటున దాక్కుని వెళతాడు. ముఖం చూపించకుండా ఉండడానికి నువ్వేమైనా రాణివా? అలాంటప్పుడు ఇక్కడెందుకు... వెళ్లి ఇడుపులపాయలో కూర్చో. ఏ గ్రామానికి వెళ్లవు, అలాంటప్పుడు నువ్వు తాడేపల్లిలో ఉంటే ఏంటి, దాచేపల్లిలో ఉంటే ఏంటి?" అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.