Roja: విజన్ ఉంది.. విస్తరాకుల కట్ట ఉంది అని ఒకాయన చెప్తాడు..: ఏపీ మంత్రి ఆర్కే రోజా

Minister RK Roja satires on TDP chief Chandrababu
  • ఫోన్ కనిపెట్టాను.. హైదరాబాద్ కనిపెట్టానని చంద్రబాబు చెబుతారన్న రోజా
  • ఏపీకి ఏం చేశారంటే.. చెప్పడానికి ఏం ఉండదని ఎద్దేవా
  • పని మనుషులు, డ్రైవర్లతో ఎంవోయూలు చేసుకున్న ఘనుడని మండిపాటు
  • రాష్ట్రంలో జగనన్న వన్స్‌మోర్ అని జనం అంటున్నారని వ్యాఖ్య
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి ఆర్కే రోజా విమర్శలు చేశారు. ‘‘విజన్ ఉంది, విస్తరాకుల కట్ట ఉంది అని ఒకాయన చెప్తాడు.. సెల్‌ఫోన్ కనిపెట్టాను.. కంప్యూటర్‌‌ కనిపెట్టాను.. నేను హైదరాబాద్ కనిపెట్టాను అని అంటాడు తప్ప ఏపీకి ఏం చేశావయ్య అంటే మాత్రం చెప్పడానికి ఏం ఉండదు” అని ఎద్దేవా చేశారు. 

గండికోట‌లో ఒబెరాయ్ హోట‌ల్ నిర్మాణ ప‌నుల‌కు సీఎం వైఎస్ జ‌గ‌న్ ఈ రోజు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో రోజా మాట్లాడుతూ.. పని మనుషులు, డ్రైవర్లతో ఎంవోయూలు చేసుకున్న ఘనుడు చంద్రబాబు అని మండిపడ్డారు. బాబు పాలనలో లిక్కర్ ఫ్యాక్టరీలే పారిశ్రామిక ప్రగతి అని డబ్బా కొట్టారని విమర్శించారు. 

తాము నిజమైన పారిశ్రామికవేత్తలతో రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని చెప్పారు. సీఎం జగన్‌పై నమ్మకంతో ఏపీకి బడా పారిశ్రామిక వేత్తలు క్యూ కడుతున్నారని అన్నారు. రాష్ట్రం నుంచి పరిశ్రమలు వెళ్లిపోతున్నాయంటూ ఎల్లో మీడియా తప్పుడు ప్రచార చేస్తోందని మండిపడ్డారు.

రాష్ట్రంలో జగన్ పాలన చూసి శభాష్ అంటున్నారని రోజా అన్నారు. ‘‘వైఎస్ జగన్ అంటే పేరు కాదు.. బ్రాండ్. రికార్డు సృష్టించాలన్నా, బద్ధలు కొట్టాలన్నా ఆయనకే సాధ్యం. 175 నియోజకవర్గాల్లో వైసీపీని గెలిపించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. జగనన్న వన్స్‌మోర్ అని జగన్ అంటున్నారు” అని చెప్పుకొచ్చారు.
Roja
Chandrababu
Jagan
YSRCP
Telugudesam

More Telugu News