salaar: సలార్ ట్రైలర్ వచ్చేది ఎప్పుడంటే?

 Release plan locked for the highly anticipated Salaar trailer
  • ఆగస్టు చివరి వారంలో విడుదల
  • సెప్టెంబర్ 28న రానున్న చిత్రం
  • సెన్సేషన్ గా మారిన టీజర్ 
రాధేశ్యామ్, ఆదిపురుష్ చిత్రాలు నిరాశ పరిచినా.. వరుస చిత్రాలతో అభిమానులను అలరించేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు. తన తదుపరి ప్రాజెక్టుల నుంచి వరుసగా సర్ ప్రైజ్ లు ఇస్తున్నారు. ఇప్పటికే ‘సలార్‌‌’ టీజర్, ‘ప్రాజెక్ట్‌ కె’ ప్రకటనలతో జోష్ పెంచారు. ‘సలార్‌‌’ చిత్రం టీజర్‌‌ ఒక్క రోజులోనే 83 మిలియన్లకు పైగా వ్యూస్‌ను రాబట్టి దేశంలోనే అత్యధిక వ్యూస్‌ వచ్చిన టీజర్‌‌గా రికార్డు సృష్టించింది. రెండు రోజుల్లో వంద మిలియన్‌ మార్క్‌ను క్రాస్‌ చేసి ఔరా అనిపించింది. ఇప్పుడు చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ట్రైలర్‌‌కు సంబంధించి అప్‌డేట్ ఇచ్చింది. 

‘మీ క్యాలెండర్‌లో ఆగస్టు నెలను మార్క్‌ చేసి పెట్టుకోండి. భారతీయ సినిమా వైభవాన్ని చాటిచెప్పే అత్యంత ఆసక్తికరమైన ట్రైలర్‌ మీకోసం రాబోతోంది’ అంటూ ఓ నోట్‌ విడుదల చేసింది. సెప్టెంబర్‌‌ 28న సినిమా విడుదల కానుంది. దీనికి నెల రోజుల ముందు అంటే ఆగస్టు చివరి వారంలో ట్రైలర్‌‌ను రిలీజ్‌ చేయబోతున్నారు. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ పార్ట్‌ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
salaar
Prabhas
trailer
teaser

More Telugu News