Telangana: మాట నిలబెట్టుకున్న కేటీఆర్

My grandmother Venkatamma Garu will be pleased for sure says KTR
  • నానమ్మ జ్ఞాపకార్థం ఆమె సొంతూరిలో పాఠశాల భవనం నిర్మాణం
  • సొంత ఖర్చులతో భారీ భవనం నిర్మాణం పూర్తి
  • దీన్ని చూసి తన నానమ్మ తప్పకుండా సంతోషిస్తుందని కేటీఆర్ ట్వీట్
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు కోనాపూర్ గ్రామస్తులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. తన నానమ్మ, దివంగత వెంకటమ్మ జ్ఞాపకార్థం ఆమె సొంతూరులో తన సొంత ఖర్చులతో ప్రభుత్వ పాఠశాలను నిర్మించారు. కామారెడ్డి నియోజకవర్గంలోని కోనాపూర్ గ్రామంలో నిర్మించిన ఈ భవనాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని ట్వీట్ చేశారు. పాఠశాల భవనం ఫొటో, వీడియోను షేర్ చేశారు. దీన్ని చూసి పైలోకంలో ఉన్న తమ నానమ్మ తప్పకుండా సంతోషిస్తారని పేర్కొన్నారు.

గతేడాది కోనాపూర్ కు వచ్చిన కేటీఆర్ నానమ్మ జ్ఞాపకార్థం గ్రామంలో పాఠశాల నిర్మిస్తానని హామీ ఇచ్చారు. ఏడాది తిరిగేలోపే భవనం సిద్ధం అవగా.. వారం రోజుల్లో తన తల్లి శోభమ్మతో కలిసి పాఠశాలను కేటీఆర్ ప్రారంభిస్తారని స్థానిక నాయకులు చెబుతున్నారు.
Telangana
KTR
grandmothe
school building

More Telugu News