Tomato: విచిత్ర ఆఫర్.. స్మార్ట్‌ఫోన్‌తో టమాటాలు ఉచితం!

Madhya Pradesh Man Offers Two Kilos Tomatoes Free For Every One Mobile Purchage
  • మధ్యప్రదేశ్‌లోని అశోక్‌నగర్‌లో సెల్‌ఫోన్ షాపు యజమాని ప్రకటన
  • పెరిగిన టమాటా ధరలను తనకు అనుకూలంగా మార్చుకున్న వ్యాపారి
  • ఒక్కో స్మార్ట్‌ఫోన్‌తో రెండు కిలోల టమాటాలు ఫ్రీ

తెలివైన వ్యాపార లక్షణం ఇదే. దేశవ్యాప్తంగా పెరిగిన టమాటా రేట్లను తనకు అనుకూలంగా వాడుకున్నాడో సెల్‌ఫోన్ షాపు యజమాని. ఒక స్మార్ట్‌ఫోన్‌తో రెండు కిలోల టమాటాలు ఉచితమంటూ ప్రత్యేక ఆఫర్ ప్రకటించి జనం దృష్టిని ఆకర్షించాడు. 

మధ్యప్రదేశ్‌లోని అశోక్‌నగర్‌కు చెందిన అశోక్ అగర్వాల్‌కు ఓ మొబైల్ షాపు ఉంది. పెరిగిన టమాటా ధరలతో ప్రజలు అల్లాడుతున్న విషయాన్ని గమనించి అశోక్ దానిని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ఒక స్మార్ట్‌ఫోన్ కొంటే రెండు కిలోల టమాటాలు ఉచితమని ప్రకటించాడు. ఈ ఆఫర్‌కు వినియోగదారుల నుంచి మంచి స్పందన వస్తున్నట్టు అశోక్ తెలిపాడు. వ్యాపారం కూడా పెరిగిందని సంతోషం వ్యక్తం చేశాడు.

  • Loading...

More Telugu News