Kishan Reddy: మోదీ కార్యక్రమాన్ని ఎందుకు బహిష్కరించారో బీఆర్ఎస్ నేతలే చెప్పాలి: కిషన్ రెడ్డి

Kishan Reddy fires on BRS leaders
  • ఇవాళ వరంగల్ వచ్చిన మోదీ
  • రూ.6 వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
  • అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న వ్యక్తి మోదీ అంటూ కిషన్ రెడ్డి ప్రసంగం
  • మోదీ కార్యక్రమానికి బీఆర్ఎస్ దూరంగా ఉందని ఆగ్రహం
  • కేసీఆర్ ను ప్రజలే బహిష్కరిస్తారని వెల్లడి
ప్రధాని నరేంద్ర మోదీ వరంగల్ సభలో తెలంగాణ బీజేపీ చీఫ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా ప్రసంగించారు. అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న వ్యక్తి.... ప్రధాని నరేంద్ర మోదీ అని కొనియాడారు. నీతి, నిజాయతీతో పనిచేస్తున్న వ్యక్తి మోదీ అని పేర్కొన్నారు.

ఇవాళ్టి ప్రధాని కార్యక్రమాన్ని బీఆర్ఎస్ బహిష్కరించిందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఎందుకు బహిష్కరించారో బీఆర్ఎస్ నేతలు చెప్పాలని నిలదీశారు. రైల్వే ఫ్యాక్టరీతో ఉద్యోగాలు ఇస్తున్నందుకు బహిష్కరించారా? ఎరువుల ఫ్యాక్టరీ పెడుతున్నందుకు బహిష్కరించారా? అని ప్రశ్నాస్త్రాలు సంధించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చనందుకు కేసీఆర్ ను తెలంగాణ ప్రజలే బహిష్కరిస్తారని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. 

కాగా, బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకే పొత్తు పెట్టుకున్న చరిత్ర ఉందని ఆరోపించారు. బీజేపీ ఎప్పటికీ బీఆర్ఎస్ తో కలవదని స్పష్టం చేశారు.
Kishan Reddy
Narendra Modi
Warangal
BJP
BRS
Telangana

More Telugu News