heavy rain: హైదరాబాద్ సహా తెలంగాణలో పలుచోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు

Heavy rains in Telangana including Hyderabad
  • కార్యాలయాల నుండి ఇళ్లకు వెళ్లే సమయంలో రోడ్లపై నిలిచిన నీరు
  • వాహనదారుల ఇబ్బందులు
  • పలు జిల్లాల్లోను వర్షం
హైదరాబాద్ సహా తెలంగాణలోని పలుచోట్ల శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. కార్యాలయాల నుండి వెళ్లే సమయంలో వర్షం పడి రోడ్లపై నీరు నిలవడంతో ఉద్యోగులు ఇబ్బందిపడ్డారు. కూకట్ పల్లి, హైదర్ నగర్, జీడిమెట్ల, బాలానగర్, సుచిత్ర, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, సికింద్రాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, తిరుమలగిరి, విద్యానగర్, రామ్ నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. జనగామ, వరంగల్ తదితర ప్రాంతాల్లోను మోస్తరు నుండి భారీ వర్షం కురిసింది.
heavy rain
Hyderabad

More Telugu News