Botsa Satyanarayana: వచ్చే ఎన్నికల్లో పొత్తులపై బొత్స సత్యనారాయణ స్పందన

YSRCP will contest single says Botsa Satyanarayana
  • వైసీపీ సింగిల్ గానే పోటీ చేస్తుందన్న బొత్స
  • ఓటమి భయం ఉన్న పార్టీలే పొత్తు పెట్టుకుంటాయని వ్యాఖ్య
  • తమ ఎన్నికల నినాదం అభివృద్ధేనని వెల్లడి
వచ్చే ఎన్నికల్లో వైసీపీ సింగిల్ గా పోటీ చేస్తుందని, ఏ ఇతర పార్టీతో పొత్తు పెట్టుకోదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. గెలవలేమని భయపడే పార్టీలే పొత్తు పెట్టుకుంటాయని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని... తమ ఎన్నికల నినాదం అభివృద్ధేనని చెప్పారు. 

పెరిగిన విద్యుత్ ఛార్జీల పేరుతో కొన్ని కంపెనీలు బ్లాక్ మెయిల్ చేస్తుండటం సరికాదని అన్నారు. వ్యాపారాలు అన్న తర్వాత లాభాలు, నష్టాలు రెండూ ఉంటాయని... లాభాలు వచ్చినప్పుడు కంపెనీలు ప్రభుత్వానికి ఏమైనా ఇచ్చాయా? అని ప్రశ్నించారు. 

Botsa Satyanarayana
YSRCP

More Telugu News