మన పార్టీ గుర్తు ఏమిటి? అని అడిగిన ధర్మానకు షాకిచ్చిన మహిళ!

Woman confused over YSRCP party symbol
  • శ్రీకాకుళం ఏడు రోడ్ల కూడలి వార్డు సచివాలయ పరిధిలో ఘటన
  • పార్టీ గుర్తు ఏమిటని అడిగిన ధర్మాన ప్రసాదరావు
  • సైకిల్ అని చెప్పడంతో అవాక్కయిన మంత్రి
మంత్రి ధర్మాన ప్రసాదరావుకు ఓ మహిళ షాకిచ్చింది! మన పార్టీ గుర్తు ఏమిటి? అని అడగ్గా... ఆమె సైకిల్ అని చెప్పడంతో మంత్రి అవాక్కయ్యారు. ఆ తర్వాత ఆమె సర్దుకొని ఫ్యాన్ అని చెప్పింది. ఈ ఘటన శ్రీకాకుళం ఏడు రోడ్ల కూడలి వార్డు సచివాలయ పరిధిలో జరిగిన 'జగనన్న సురక్ష' కార్యక్రమం సందర్భంగా చోటు చేసుకుంది. 

వేదిక మీదకు వచ్చిన మహిళను పార్టీ గుర్తు ఏమిటని అడగ్గా... నవ్వుతూ సైకిల్ అని చెప్పారు. ఆ తర్వాత "సారీ... సారీ... ఫ్యాన్" అంటూ తిరిగి సమాధానం చెప్పింది. కాస్త బుర్రలోకి ఎక్కించుకోవాలని ధర్మాన ఆమెకు సూచించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Go Back to Shorts
woman
Srikakulam District

More Telugu News