Pawan Kalyan: పవన్ పై దుష్ప్రచారం చేస్తున్న వైసీపీ ఖాతాలపై చర్యలు తీసుకుంటున్నాం: జనసేన

Janasena said they will take action on who spreads rumors on Pawan Kalyan and his wife Anna
  • పవన్, అన్నా లెజ్నెవా విడిపోయారంటూ కథనాలు
  • చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్న జనసేన లీగల్ సెల్
  • అసత్య ప్రచారం చేస్తున్నాయంటూ కొన్ని సోషల్ మీడియా ఖాతాల పేర్లు వెల్లడి
జనసేనాని పవన్ కల్యాణ్, భార్య అన్నా లెజ్నెవా విడిపోయారంటూ ఇటీవల కథనాలు రావడం తెలిసిందే. దీనిపై జనసేన పార్టీ తీవ్రంగా స్పందించింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై తప్పుడు కథనాలు, అసభ్యకర పోస్టులు పెట్టినవారిపై చట్టపరంగా తీవ్రమైన చర్యలు తీసుకుంటామని జనసేన పార్టీ  వెల్లడించింది. 

పవన్ పై తప్పుడు ప్రచారం చేస్తున్న వైసీపీకి చెందిన నేతలు, కార్యకర్తలతో పాటు, వారి అనుబంధ యూట్యూబ్ చానల్స్, పలు మీడియా సంస్థలపై చర్యలు తీసుకోనున్నామని తెలిపింది. ఈ మేరకు వైసీపీకి చెందిన కొన్ని అసభ్యకర ఖాతాల వివరాలు అంటూ జనసేన పార్టీ ఓ జాబితాను పంచుకుంది. అందులో కొన్ని మీడియా సంస్థలు కూడా ఉన్నాయి.
Pawan Kalyan
Anna Lezneva
Janasena
YSRCP
Andhra Pradesh

More Telugu News