Uttar Pradesh: రూ.1.5 లక్షల బ్యాగుతో చెట్టెక్కిన కోతి! ఆ తరువాత..

Monkey steals rs one and half lakh from bag on a bike in uttarpradesh
  • ఉత్తరప్రదేశ్‌లోని షాబాద్‌లో వెలుగు చూసిన ఘటన
  • బైక్‌కు అమర్చిన బ్యాగులోని 1.5 లక్షలున్న బ్యాగుతో చెట్టెక్కిన కోతి
  • కోతిని ఏమార్చి బ్యాగు జారవిడిచేలా చేసిన స్థానికులు
  • డబ్బు తిరిగి దక్కడంతో ఊపిరిపీల్చుకున్న బాధితుడు
ఉత్తరప్రదేశ్‌లో అనూహ్య ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ కోతి ఏకంగా రూ. 1.5 లక్షలను చోరీ చేసింది. షాబాద్‌లోని రిజిస్ట్రీ ఆఫీసుకు వచ్చిన షరాఫత్ హుస్సేన్ బైక్ నిలిపి కార్యాలయం లోపలికి వెళ్లాడు. తన రూ.1.5 లక్షలను బైక్‌కు ఉన్న బ్యాగులోనే పెట్టాడు. కొద్ది సేపటికి బయటకు వచ్చిన అతడు బ్యాగులోని రూ.1.5 లక్షలు కనిపించకపోవడంతో కంగుతిన్నాడు. డబ్బు ఉన్న బ్యాగును ఓ కోతి ఎత్తుకుపోయిందని తెలిసి ఏం చేయాలో పాలుపోలేదు. 

ఈలోపు రంగంలోకి దిగిన స్థానికులు బ్యాగుతో చెట్టుపై ఉన్న కోతిని ఏమార్చి బ్యాగు కిందకు జారవిడిచేలా చేశారు. దీంతో, షరాఫత్‌కు ప్రాణం లేచొచ్చినంత పనైంది. కాగా, ఘటనపై జిల్లా అధికారులు స్పందించారు. ఆ ప్రాంతంలో  కోతుల బెడద ఎక్కువగా ఉందని అంగీకరించిన వారు సమస్య పరిస్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Uttar Pradesh
Robbery
Viral Pics

More Telugu News