Sajjala Ramakrishna Reddy: ముందస్తు ఎన్నికలపై మరోసారి స్పష్టత నిచ్చిన సజ్జల

Sajjala clarifies again on early polls
  • ఏపీలో ముందస్తు ఎన్నికలు అంటూ ప్రచారం
  • మీడియా సృష్టి అన్న సజ్జల
  • కొన్ని పార్టీలు కూడా ముందస్తు అంటూ ప్రచారం చేస్తున్నాయని వెల్లడి
  • చివరి రోజు వరకు పాలన కొనసాగుతుందని స్పష్టీకరణ

ఏపీలో ముందస్తు ఎన్నికలు ఖాయమంటూ పలువురు నేతలు అంటుండడం, కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు రావడం, వాటిని వైసీపీ ప్రభుత్వ పెద్దలు ఖండించడం పరిపాటిగా మారింది. తాజాగా ఇదే అంశంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. 

ముందస్తు ఎన్నిలపై ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వ వైఖరిని వెల్లడించిన సజ్జల... మరోసారి స్పష్టత నిచ్చారు. ఏపీలో ముందస్తు ఎన్నికలు అనేది మీడియా సృష్టి అని, కొన్ని పార్టీలు ముందస్తు అని ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ముందస్తు ఎన్నికలకు వెళ్లబోమని సజ్జల స్పష్టం చేశారు. 

తమ ప్రభుత్వానికి ప్రజలు నిర్దేశించిన మేరకు చివరి రోజు వరకు పాలన కొనసాగుతుందని, తమ ప్రభుత్వం పూర్తి కాలం కొనసాగుతుందని వివరించారు. చంద్రబాబు ముందస్తు అంటూ ప్రణాళికలు వేసుకుంటున్నారని, ఆయన తలకిందులుగా తపస్సు చేసినా ఏపీలో ముందస్తు ఎన్నికలు జరగవని అన్నారు.

  • Loading...

More Telugu News