Huma Qureshi: అనుమతి తీసుకున్నాకే హీరోయిన్‌కు ముద్దు.. సెలబ్రిటీపై నెట్టింట ప్రశంసల వర్షం

Video of Gary mehigan kissing huma qureshi after seeking permission goes viral
  • ముంబైలో ‘తర్లా’ సినిమా ప్రచార కార్యక్రమంలో తళుక్కుమన్న నటి హ్యూమా ఖురేషీ
  • కార్యక్రమానికి అథిగా విచ్చేసిన మాస్టర్ షెఫ్ ఆస్ట్రేలియా షో మాజీ జడ్జి గ్యారీ మైగెన్
  • ఇద్దరూ కలిసి ఫొటోలకు పోజులు
  • నిన్ను ముద్దుపెట్టుకుంటానంటూ హ్యూమాను పర్మిషన్ అడిగిన గ్యారీ
  • ఆమె ఓకే చెప్పాకే చుంబనం, వీడియో చూసి నెటిజన్ల ప్రశంసలు
తారలపై అభిమానం హద్దు మీరుతున్న కాలమిది. ముఖ్యంగా హీరోయిన్లు పబ్లిక్‌లో కనిపిస్తే చాలు అభిమానం పేరిట కొందరు కట్టు తప్పుతుంటారు. ఒంటి మీద చేతులు వేయడం, కిస్ చేసేందుకు ప్రయత్నిచడం వంటివి నటీమణులకు ఇబ్బందులు తెచ్చి పెడుతున్నాయి. గతంలో హాలీవుడ్ నటుడు రిచర్డ్ గేర్, శిల్పా శెట్టి ఉదంతం ఎంతటి వివాదానికి దారి తీసిందో తెలిసిందే. తాజాగా, బాలీవుడ్ హీరోయిన్‌ హ్యూమా ఖురేషీని పబ్లిక్‌గా కిస్ చేసిన ఓ ఇంటర్నేషనల్ సెలబ్రిటీపై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది. ముద్దుకు ఆమె ఓకే చెప్పాకే ఆయన ప్రొసీడవడంతో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషీ ప్రస్తుతం ‘తర్లా’ సినిమా చేసింది. ఇది త్వరలో ఓటీటీలో విడుదల కానుంది. ఈ క్రమంలో ముంబైలో జరిగిన ఓ ప్రచార కార్యక్రమానికి ఆమె హాజరైంది. మాస్టర్ షెఫ్ ఆస్ట్రేలియా షో మాజీ జడ్జి గ్యారీ మైగెన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హ్యూమాతో కలిసి ఫొటోలకు పోజులిచ్చిన ఆయన ఆ తరువాత ‘‘నిన్ను ముద్దుపెట్టుకోనా?’’ అని హ్యూమాను కోరారు. హ్యూమా ఓకే చెప్పడంతో ఆమె బుగ్గపై చుంబించారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌ కావడంతో నెటిజన్లు ఆయన సంస్కారం చూసి ప్రశంసిస్తున్నారు. వీడియో కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
Huma Qureshi
Gary Mehigan
Master Chef Australia
Viral Videos

More Telugu News