Hyderabad: పరువు తీస్తూ.. భార్య వేధిస్తోందని భర్త ఆత్మహత్య

Fed up with domestic disputes hyderabad man ends life
  • హైదరాబాద్‌ కుషాయిగూడలో వెలుగు చూసిన ఘటన
  • వేరు కాపురం పెట్టాలంటూ భార్య ఒత్తిడి
  • కుటుంబకలహాలతో పరువుపోతోందని భర్త ఆవేదన 
  • అతడి ఆవేదనను భార్య, ఆమె తల్లితండ్రులు కొట్టిపారేసిన వైనం
  • పురుగుల మందు తాగి భర్త ఆత్మహత్యాయత్నం, ఆసుపత్రిలో మృతి

భార్య, ఆమె తల్లిదండ్రుల వేధింపులు తట్టుకోలేక ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డారు. ప్రైవేటు ఉద్యోగి అయిన మొలుగు వెంకట రెడ్డి కుషాయిగూడలోని పోచమ్మగుడి వద్ద ఉంటున్నారు. ఆయనకు భార్య కల్యాణి, ఏడు, రెండేళ్ల వయసున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వెంకట్‌రెడ్డి తల్లితో కూడా ఆయనతో పాటే నివసిస్తోంది. ఇటీవల కాలంలో వేరు కాపురం విషయంలో దంపతుల మధ్య వివాదం చెలరేగింది. దీంతో, భార్య అలిగి రెండు నెలల క్రితం వరంగల్‌లోని తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ నెల 2న తల్లిదండ్రులను తీసుకుని భర్త ఇంటికొచ్చి గొడవకు దిగింది. అత్తను ఇంటినుంచి పంపించాలని, ఆస్తి పిల్లల పేరున రాయాలని ఒత్తిడి తెచ్చింది. 

ఈ విషయమై ఆమె పెడబొబ్బలు పెడుతుంటే విషయం బయటవారికి తెలిసి కుటుంబ పరువు పోతుందని వెంకట్ రెడ్డి ఒత్తిడికి లోనయ్యారు. వద్దని చెప్పినా భార్య వినకపోవడంతో చచ్చిపోతానని హెచ్చరించాడు. అయితే, ఇదంతా డ్రామాలని, అతడు చచ్చేది లేదని అత్తమామలు భార్య హేళన చేయడంతో వెంకట్ రెడ్డి అదే రోజున పురుగుల మందు తాగాడు. తల్లి ఆసుపత్రికి తరలించగా అక్కడ బుధవారం మృతి చెందాడు. మృతుడి సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News