Ishant Sharma: ధోనీ మీరనుకున్నంత కూల్ ఏమీ కాదు.. బూతులు తిడతాడు: ఇషాంత్‌శర్మ సంచలన వ్యాఖ్యలు

Dhoni was not calm and used to abuse Indian players Ishant Sharma Blasting Comments
  • ధోనీ అందరూ అనుకున్నంత కూల్ కాదన్న ఇషాంత్
  • తాను కూడా ధోనీతో తిట్లు తిన్నానన్న వెటరన్ పేసర్
  • ధోనీ జాబితాలో ‘కామ్ అండ్ కూల్’ లేవని వ్యాఖ్య

ధోనీ అందరూ అనుకున్నంత కూల్ ఏమీ కాదని, మైదానంలో ఆటగాళ్లను బూతులు తిడతాడని టీమిండియా వెటరన్ పేసర్ ఇషాంత్‌శర్మ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ధోనీకి ఎన్నో బలాలున్నా ‘కామ్ అండ్ కూల్’ మాత్రం ఆ జాబితాలో లేవని పేర్కొన్నాడు. మైదానంలో ఆటగాళ్లను బూతులు తిడుతుంటాడని, తాను వినడమే కాకుండా అతడితో తిట్లు కూడా తిన్నానని చెప్పుకొచ్చాడు.

తానోసారి బౌలింగ్ పూర్తిచేశాక ధోనీ తన వద్దకు వచ్చి నువ్వు అలసిపోయావా? అని అడిగాడని, దానికి తాను అవును అని సమాధానమిస్తే.. వయసైపోయింది.. రిటైర్ అయిపోమని సలహా ఇచ్చాడని గుర్తు చేసుకున్నాడు. ఒకసారి మహీభాయ్ విసిరిన త్రోను తాను అందుకోలేకపోయినందుకు తనపై కోపంగా చూశాడని, రెండోసారి బలంగా విసిరిన త్రోను కూడా పట్టకోలేకపోయానని పేర్కొన్నాడు. మూడోసారి వేసేటప్పుడు మాత్రం ఈసారి తలబాదుకో అని గట్టిగా అరిచాడంటూ ధోనీ కోపం గురించి వివరించాడు.

  • Loading...

More Telugu News