BCCI: విండీస్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ఎంపిక: కెప్టెన్‌గా హార్దిక్, హైదరాబాదీ తిలక్‌కు చోటు

BCCI Announces T20I Squad For West Indies Tour
  • రోహిత్, కోహ్లీలకు విశ్రాంతినిచ్చిన సెలెక్టర్లు
  • వైస్ కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్
  • ముంబై ఇండియన్స్ తరఫున అదరగొట్టిన తిలక్ వర్మ
వెస్టిండీస్ తో జరగనున్న టీ20 సిరీస్ కు భారత జట్టును బీసీసీఐ బుధవారం ప్రకటించింది. టీమిండియా త్వరలో విండీస్ తో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. ఇప్పటికే టెస్టులు, వన్డేలకు జట్లను ప్రకటించిన బీసీసీఐ ఈ రోజు టీ20 జట్టును ఎంపిక చేసింది. జులై 12న తొలి టెస్టుతో వెస్టిండీస్ షెడ్యూల్ ప్రారంభం కానుంది.

కరేబియన్ దీవులు, అమెరికాలోని ఫ్లోరిడాలో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇచ్చారు. హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. సూర్యకుమార్ యాదవ్ ను వైస్ కెప్టెన్ గా ఎంపిక చేశారు. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరఫున అదరగొట్టిన హైదరాబాద్ క్రికెటర్ తిలక్ వర్మకు భారత జట్టులో చోటు దక్కింది.

ఐదు టీ20లకు భారత జట్టు: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్(వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), శుభమాన్ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్ష్ దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేశ్ ఖాన్ , ముఖేశ్ కుమార్.
BCCI
Hyderabad
west indies
Cricket

More Telugu News