Telangana: తెలంగాణ నుంచి కేరళకు విమానంలో వెళ్లి మరీ చోరీలు!

Thief from Telangana travels to kerala by flight to commit robbery
  • కేరళ పోలీసులకు చిక్కిన ఖమ్మం వ్యక్తి 
  • విమానంలో వెళ్లి, అక్కడ ఆటోల్లో తిరుగుతూ రెక్కీ
  • తాళం వేసున్న ఇళ్లు గుర్తించి, రాత్రి సమయాల్లో చోరీ
  • బంగారు నగలను మాత్రమే దొచుకుంటున్న వైనం
  • నిందితుడి వివరాలను వెల్లడించిన తిరువనంతపురం పోలీస్ కమిషనర్

తెలంగాణకు చెందిన ఓ ఘరానా దొంగను కేరళ పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. ఖమ్మం జిల్లా నుంచి తరచూ విమానాల్లో కేరళకు వచ్చి చోరీలు చేసి వెళుతుంటాడని చెప్పారు. బంగారు ఆభరణాలు మాత్రమే చోరీ చేసి వాటిని స్థానికంగా తాకట్టుపెట్టి డబ్బులతో వెళ్లిపోతుంటాడని చెప్పుకొచ్చారు. నిందితుడి వివరాలను తిరువనంతపురం ఎస్పీ తాజాగా వెల్లడించారు. 

‘‘ఈ వ్యక్తి కేరళకు విమానాల్లో వస్తుంటాడు. ఇక్కడకు వచ్చాక ఆటోల్లో స్థానికంగా చక్కర్లు కొడుతూ తాళం వేసి ఉన్న ఇళ్లు ఏవో గుర్తిస్తాడు. ఆ తరువాత గూగుల్ మ్యాప్ సాయంతో రాత్రి సమయాల్లో మళ్లీ ఆ ఇళ్లకు వచ్చి చోరీ చేస్తాడు. అతడు కేవలం బంగారు నగలు మాత్రమే చోరీ చేసేవాడు. కానీ, వాటిని ఖమ్మం తీసుకెళ్లేవాడు కాదు. నగలను ఇక్కడే తాకట్టు పెట్టి వచ్చిన డబ్బును వెంటతీసుకెళ్లేవాడు. గత మే నెలలో పద్మనాభ స్వామి ఆలయం సందర్శనకు వచ్చాడు. ఇందుకు జూన్‌లో ప్రణాళిక వేసుకున్నాడు. ఆ ప్రకారం మళ్లీ వచ్చాడు’’ అని తిరువనంతపురం పోలీస్ కమిషనర్ సీహెచ్ నాగరాజు వెల్లడించారు.

  • Loading...

More Telugu News