air india: లక్నోలో ఎయిరిండియా ఎమర్జెన్సీ ల్యాండింగ్.. విమానంలో ఏపీ అధికారులు

Air India pilot makes emergency landing in lucknow
  • ఢిల్లీ నుండి విశాఖపట్నం వస్తున్న విమానంలో సాంకేతిక లోపం
  • విమానంలో ఏపీకి చెందిన ప్రభుత్వ ఉన్నతాధికారులు
  • తమను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆందోళన
ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో ఎయిరిండియా విమానం శుక్రవారం ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. దేశ రాజధాని ఢిల్లీ నుండి విశాఖపట్నం వస్తున్న ఈ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో లక్నో విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఈ విమానంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు ఉన్నారు. వారిని ఎప్పుడు పంపుతారో ఎయిర్ లైన్స్ సమాచారం ఇవ్వవలసి ఉంది. తమను ఎవరూ పట్టించుకోవడం లేదని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.
air india
lucknow
Andhra Pradesh

More Telugu News