YS Jagan: జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు: ఏపీ రాజకీయాలపై నటుడు సుమన్

Actor Suman says YS Jagan will become cm again
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు జగన్ వెంటే ఉన్నారన్న సుమన్
  • జగన్ లా మేనిఫెస్టో అమలు చేసినవారు దేశంలో ఎవరూ లేరని కితాబు
  • ప్రతిపక్షాల నుండి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పలేని పరిస్థితి అని వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై సినీ నటుడు సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. ప్రతిపక్షాల పొత్తుపై స్పష్టత లేదని వ్యాఖ్యానించారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట పుల్లేటికుర్రులో శ్రీ చౌడేశ్వరిదేవి సమేత రామలింగేశ్వర ఆలయంలో సుదర్శన యాగంలో సుమన్ పాల్గొన్నారు. అనంతరం తాజా రాజకీయాలపై మాట్లాడుతూ... జగన్ సీఎం అవుతారన్నారు. ప్రతిపక్ష పార్టీలకు పొత్తులపై స్పష్టత లేదని, ప్రతిపక్షాల నుండి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పలేని పరిస్థితి ఉందన్నారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు జగన్ వెంటే ఉన్నారని, రెడ్డి కమ్యూనిటీ కూడా మెజార్టీ ఆయన వైపు ఉందని చెప్పారు. జగన్ లా మేనిఫెస్టోలోని హామీలను అమలు చేసినవారు దేశంలోనే ఎవరూ లేరన్నారు. నవరత్నాలు 95 శాతం అమలు చేశారని ప్రశంసించారు. కరోనా సమయంలో పేదలను ఆదుకున్నారని, ఆయన చేసిన సాయం ఎవరూ మరిచిపోలేరన్నారు. కేబినెట్లో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చారన్నారు.
YS Jagan
suman
Andhra Pradesh

More Telugu News