Ganta Srinivasa Rao: ప్రత్యక్ష రాజకీయాల్లోకి గంటా శ్రీనివాస్ కుమారుడు? లోకేశ్ పాదయాత్రలో రవితేజ!

Ganta Srinivas Rao son Raviteja in Lokesh padayatra
  • వచ్చే ఎన్నికలే గంటాకు చివరివి కావొచ్చంటున్న అనుచరులు
  • కొడుకును ముందుకు తీసుకొచ్చే అవకాశం
  • వారం రోజులుగా పాదయాత్రలో లోకేశ్ తో కలిసి నడుస్తున్న రవితేజ

రాజకీయాల్లో గంటా శ్రీనివాసరావుది ఒక ప్రత్యేకమైన స్థానమని చెప్పుకోవాలి. వరుసగా ఒకసారి ఎంపీగా, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన పేరిట ఒక రికార్డు ఉంది. నాలుగు సార్లు పోటీ చేసిన చోట నుంచి తిరిగి పోటీ చేయకుండా నాలుగు నియోజకవర్గాల నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన... వచ్చే ఎన్నికల్లో భీమిలి నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని చెపుతున్నారు. 

మరోవైపు వచ్చే ఎన్నికలే గంటాకు చివరివి కావచ్చని, ఆ తర్వాత ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యే అవకాశం ఉండొచ్చని ఆయన అనుచరులు చెపుతున్నారు. తన వారసుడు రవితేజను ముందుకు తీసుకురావచ్చని అంటున్నారు. రవితేజ మాజీ మంత్రి నారాయణ కూతురుని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు రాజకీయాల్లో ఎప్పుడూ ప్రత్యక్షంగా కనిపించని రవితేజ... నారా లోకేశ్ పాదయాత్రలో కనిపిస్తున్నారు. గత వారం రోజులుగా యువగళం పాదయాత్రలో లోకేశ్ తో కలిసి నడుస్తున్నారు. లోకేశ్ పాదయాత్రలో రవితేజ కనిపిస్తుండటం ఆసక్తికరంగా మారింది.

  • Loading...

More Telugu News