Cricket: భారత–ఎ జట్టుకు ఎంపికైన తెలుగు కుర్రాడు

  • ఎమర్జింగ్‌ ఆసియా కప్‌కు ఎంపిక
  •  ఆంధ్ర జట్టు తరఫున సత్తా చాటుతున్న నితీశ్
  •  ఈ నెల 13 నుంచి శ్రీలంకలో టోర్నీ
Andhra cricketer Nitish Kumar Reddy selected for INDIA A team

దేశవాళీ క్రికెట్ లో సత్తా చాటుతున్న ఆంధ్ర ఆటగాడు నితీశ్‌ కుమార్‌ రెడ్డి ప్రతిభకు గుర్తింపు లభించింది. నితీశ్ భారత–ఎ జట్టుకు ఎంపికయ్యాడు. పురుషుల ఎమర్జింగ్‌ ఆసియా కప్‌ కోసం బీసీసీఐ ఎంపిక చేసిన జట్టులో ఏపీ కుర్రాడికి చోటు దక్కింది. బ్యాటింగ్ ఆల్ రౌండర్ అయిన నితీశ్ గత ఐపీఎల్ సన్ రైజర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. కానీ, ఒకే మ్యాచ్‌ లో అతనికి అవకాశం వచ్చింది. 

కాగా, ఈ నెల 13 నుంచి 23 వరకు శ్రీలంకలోని కొలంబో వేదికగా వన్డే ఫార్మాట్‌లో ఎమర్జింగ్ ఆసియా కప్ జరగనుంది. అండర్‌19 వరల్డ్‌ కప్‌ నెగ్గిన జట్టు కెప్టెన్ యశ్‌ ధూల్‌ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. ఈ టోర్నీలో ఎనిమిది జట్లు రెండు గ్రూపుల్లో పోటీ పడుతాయి. భారత్, నేపాల్‌, యూఏఈ, పాకిస్థాన్‌ గ్రూప్‌–బిలో ఉన్నాయి. ఆతిథ్య శ్రీలంకతో పాటు బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్థాన్‌, ఒమన్‌ గ్రూప్‌–ఎలో బరిలో నిలిచాయి. 

 భారత –ఎ జట్టు: యష్ ధుల్ (కెప్టెన్‌), సాయి సుదర్శన్, అభిషేక్ శర్మ (వైస్‌ కెప్టెన్‌ ), నికిన్ జోస్, ప్రదోష్ రంజన్ పాల్, రియాన్ పరాగ్, నిషాంత్ సింధు, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (కీపర్‌), ధ్రువ్ జురెల్ (కీపర్‌), మానవ్ సుతార్, యువరాజ్‌ సింగ్ దోడియా, హర్షిత్ రాణా, ఆకాష్ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి, రాజవర్ధన్ హంగర్గేకర్. స్టాండ్‌బై ఆటగాళ్లు: హర్ష్ దూబే, నెహాల్ వధేరా, స్నెల్ పటేల్, మోహిత్ రెడ్కర్.

  • Loading...

More Telugu News