Samantha: కొత్త జంటగా సమంత, విజయ్ గుడిలో యాగం

Samantha and Vijay Deverakonda seen shooting at temple for Kushi
  • రాజమండ్రిలో ఖుషి సినిమా షూటింగ్
  • గుడిలో క్లైమాక్స్ సన్నివేశాలు చిత్రీకరణ
  • చీర, పంచకట్టులో కనిపించిన సమంత, విజయ్
పెళ్లి చూపులు సినిమాతో తొలి హిట్ ఖాతాలో వేసుకొని అర్జున్‌ రెడ్డితో టాలీవుడ్ టాప్ హీరోగా మారిన నటుడు విజయ్ దేవరకొండ. ఓపక్క వరుసగా ఫ్లాప్ లు పడుతున్నా, ఆయన స్టార్ డమ్ ఏమాత్రం తగ్గడం లేదు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ప్యాన్ ఇండియా చిత్రం లైగర్ డిజాస్టర్‌ అవ్వడంతో విజయ్‌ ఇప్పుడు ఓ హిట్ కోసం పరితపిస్తున్నాడు. ఈ క్రమంలో శివ నిర్వాణ దర్శకత్వంలో తను హీరోగా నటిస్తున్న ‘ఖుషి’ చిత్రంపై గంపెడాశలు పెట్టుకున్నాడు. ఇందులో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. ఇద్దరూ దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడంతో ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. కశ్మీర్ బ్యాక్ డ్రాప్ లో ముస్లిం యువతి పాత్రలో సమంత, ఆమెను ప్రేమించే హీరో పాత్రలో విజయ్ కనిపించనున్నారు.

 సమంత అనారోగ్యం కారణంగా షూటింగ్ తొలుత కొంత ఆలస్యం అయినా.. తర్వాత వరుస షెడ్యూల్స్‌ తో చిత్రీకరణ శరవేగంగా సాగింది. తాజాగా రాజమండ్రి సమీపంలోని ఓ దేవాలయంలో క్లైమాక్స్ సన్నివేశాల షెడ్యూల్ ను పూర్తి చేసినట్టు సమచారం. షూటింగ్ స్పాట్ లో తీసిన ఓ వీడియో ఇప్పుడు నెట్‌ లో చక్కర్లు కొడుతోంది. ఇందులో కుటుంబ సభ్యులంతా గుడిలో యాగం చేస్తుండగా చీరకట్టులో సమంత, పంచ కట్టుకున్న విజయ్ అప్పుడే పెళ్లి చేసుకున్న కొత్త జంటగా కనిపించారు. ఇద్దరూ చేతులు జోడించి నమస్కరిస్తూ కనిపించారు. ఇది ఎండ్ టైటిల్స్ పడే సీన్‌ లా ఉంది. దాంతో, సినిమా షూటింగ్ పూర్తయిందని తెలుస్తోంది. దీనిపై చిత్ర బృందం ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా, ఈ సినిమా సెప్టెంబర్‌ 1న  పలు భాషల్లో విడుదల కానుంది.
Samantha
Vijay Devarakonda
khushi movie
shooting

More Telugu News