Uttar Pradesh: కాబోయే అత్తగారు సిగరెట్ తాగిందని పెళ్లి వద్దన్న వరుడు

Groom refuses to marriage because his mother in law smokes in ceremony
  • యూపీలోని సంభాల్ జిల్లాలో ఘటన
  • వివాహానికి ముందు జరిగిన వేడుక
  • వధువు తల్లి సిగరెట్ కాల్చడంతో పెళ్లి కొడుకు షాక్
  • గ్రామ పెద్దలు నచ్చజెప్పడంతో వివాహానికి ఒప్పుకున్న వరుడు
పెళ్లి వేడుకలో వధువు తల్లి సిగరెట్ కాల్చడం చూసిన వరుడు తనకు పెళ్లి వద్దంటూ మొండికేశాడు. వివాహ వేదిక నుంచి వెళ్లిపోయాడు. యూపీలోని సంభాల్‌ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 27న కల్యాణ మండపానికి చేరిన వరుడు వివాహానికి ముందు జరిగిన వేడుకలో తన కాబోయే అత్తగారు సిగరెట్‌ తాగుతూ నృత్యం చేయడాన్ని చూసి షాకయ్యాడు. సభ్యత, సంప్రదాయం లేకుండా ఇలా సిగరెట్‌ తాగడమేమిటని ఆగ్రహించిన వరుడు వెంటనే వేడుకను నిలిపివేయించాడు. పెళ్లిని రద్దు చేస్తున్నట్టు ప్రకటించి తన బంధువులతో మండపం నుంచి వెళ్లిపోయాడు. ఈ విషయంపై గ్రామ పెద్దలు పంచాయితీ నిర్వహించి వరుడికి నచ్చజెప్పడంతో వివాహానికి ఒప్పుకోవడంతో కథ సుఖాంతమైంది.
Uttar Pradesh
Groom
smoking
marriage

More Telugu News