Shark: సముద్ర తీరంలో షార్క్ చక్కర్లు.. వణికిపోయిన జనం.. వీడియో ఇదిగో!

Shark Swims Near Shore Around Beachgoers In US
  • ఫ్లోరిడాలోని నెవారె బీచ్ లో ఘటన
  • షార్క్ ను చూసి ఒడ్డుకు పరుగులు పెట్టిన జనం
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
బీచ్ ఒడ్డున సేదతీరేందుకు వెళ్లిన అమెరికన్లను వణికించిందో షార్క్.. తీరానికి దగ్గర్లోనే చక్కర్లు కొడుతుండడం చూసి నీళ్లలో ఆటలాడుతున్న వారంతా ఒడ్డుకు పరుగులు పెట్టారు. అమెరికాలోని ఫ్లోరిడా నెవారె బీచ్ లో సోమవారం సాయంత్రం చోటుచేసుకుందీ ఘటన. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే, కాసేపటి తర్వాత ఆ షార్క్ సముద్రంలోకి వెళ్లిపోయిందని, ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు.

షార్క్ తో పాటు ఓ డాల్ఫిన్ కూడా తీరంలో చక్కర్లు కొట్టిందని, కాసేపటికి డాల్ఫిన్ వెళ్లిపోయినా షార్క్ అక్కడక్కడే తిరిగిందని ఈ వీడియో తీసిన మహిళ క్రిస్టీ కాక్స్ తెలిపింది. చిన్నచిన్న చేపలను వేటాడుతూ షార్క్ తీరానికి సమీపంలోకి వచ్చిందని, ఈ క్రమంలో తీరంలో ఈత కొడుతున్న వారి పక్కనుంచే వెళ్లడంతో తామంతా వణికిపోయామని వివరించింది. తన మొబైల్ తో షార్క్ ను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు తెలిపింది.
Shark
USA
Navarre Beach
Florida
swimmers

More Telugu News