Mahesh Babu: టైమ్స్ స్క్వేర్ లో సితార.. భావోద్వేగానికి గురైన మహేశ్ బాబు

Mahesh Babu emotional tweet about his daughter
  • జ్యువెలరీ యాడ్ లో నటించిన సితార
  • అమెరికాలోని టైమ్స్ స్క్వేర్ లో యాడ్ ప్రదర్శన
  • టైమ్స్ స్క్వేర్ నే వెలిగిస్తున్నావు అంటూ మహేశ్ భావోద్వేగం

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ముద్దుల తనయ సితార చిన్న వయసులోనే పెద్ద సెలెబ్రిటీగా మారిపోతోంది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే సితార డ్యాన్సులతో అందరినీ ఆకట్టుకుంటోంది. మరోవైపు ప్రముఖ జ్యువెలరీ సంస్థ యాడ్ లో ఆమె నటించింది. నగలు ధరించి యాడ్ లో ఆమె పోజులిచ్చింది. దీన్ని అమెరికాలోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ బిల్ బోర్డ్ పై ప్రదర్శించారు. దీనిపై మహేశ్ బాబు ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. 'టైమ్స్ స్వేర్ నే వెలిగిస్తున్నావు. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. నీవు ఇలాగే ప్రకాశిస్తూ ఉండాలి' అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News