Komatireddy Venkat Reddy: నేను అస్వస్థతకు గురయ్యానని ఓ చానల్ లో వస్తున్న వార్తలు అవాస్తవం: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Komatireddy condemns TV news that he suffers illness
  • కోమటిరెడ్డికి బ్రీతింగ్ ప్రాబ్లం అంటూ వార్తలు
  • ఆర్టీవీ చానల్లో ప్రసారం అవుతున్న దాంట్లో నిజంలేదన్న కోమటిరెడ్డి
  • తప్పుడు వార్తలు ప్రసారం చేస్తే ఊరుకోనని హెచ్చరిక
  • తాను ఆరోగ్యంగానే ఉన్నానని వెల్లడి
తాను అనారోగ్యం పాలయ్యానంటూ ఓ టీవీ చానల్లో వార్తలు ప్రసారం అవుతుండడం పట్ల కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో స్పందించారు. 

"నేను అస్వస్థతకు గురయ్యానని ఆర్టీవీ చానల్ లో వస్తున్న వార్తల్లో నిజం లేదు. నేను ప్రస్తుతం హైదరాబాదులోని నివాసంలో ఉన్నా. నాకు ఎలాంటి శ్వాస సంబంధ సమస్య రాలేదు. తప్పుడు వార్తలు ప్రసారం చేస్తే ఊరుకోను... చట్టపరమైన చర్యలు తీసుకుంటా. నేను ఆరోగ్యంగానే ఉన్నాను. కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు గురికావొద్దు... నేను అస్వస్థతకు లోనయ్యాన్న ఫేక్ న్యూస్ ను నమ్మవద్దు" అంటూ కోమటిరెడ్డి ట్విట్టర్ లో పేర్కొన్నారు.
Komatireddy Venkat Reddy
TV News
Illness
Congress
Telangana

More Telugu News