Akanksha: హిందీ బిగ్ బాస్ షోలో లిప్ లాక్.. షో నుంచి ఎలిమినేట్ అయిన ఆకాంక్ష

Akanksha eleminated from Big Boss for lip kissing
  • బిగ్ బాస్ లో కిస్ చేసుకున్న ఆకాంక్ష, జైద్
  • ఆగ్రహం వ్యక్తం చేసిన హోస్ట్ సల్మాన్ ఖాన్
  • టాస్క్ లో భాగంగానే చేశానన్న ఆకాంక్ష
హిందీ బిగ్ బాస్ ఓటీటీ-2లో ఒక జంట అందరూ ఆశ్చర్యపోయేలా చేసింది. చుట్టూ కెమెరాలు ఉన్నాయనే విషయాన్ని కూడా పట్టించుకోకుండా లిప్ లాక్ ఇచ్చుకున్నారు. నటి ఆకాంక్ష, జైద్ ఇద్దరూ అధర చుంబనం చేసుకున్నారు. దీనిపై ఈ షోను హోస్ట్ చేస్తున్న సల్మాన్ ఖాన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నెటినెన్లు అయితే వారిపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆకాంక్షపై వేటు పడింది. షో నుంచి ఆమె ఎలిమినేట్ అయింది. 

దీనిపై ఆకాంక్ష స్పందిస్తూ.. ఈ విధంగా షో నుంచి బయటకు వచ్చినందుకు చాలా బాధగా ఉందని తెలిపింది. ఒక టాస్క్ లో భాగంగానే తాను ముద్దు పెట్టానని... టాస్క్ కింద తనకు 30 సెకన్ల సమయం ఇచ్చారని, దీన్ని టాస్క్ గానే భావించానని చెప్పింది. లిప్ లాక్ చేయాలనే ఆసక్తి తనకు లేదని... జైద్ స్థానంలో మరొకరు ఉన్నా తాను ఇదే పని చేసేదాన్నని తెలిపింది. ఇది ఇంత పెద్ద సమస్య అవుతుందనే విషయం తనకు ఆ సమయంలో తెలియలేదని చెప్పింది. మరోవైపు మరో నాలుగు రోజుల్లో జైద్ కూడా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రావచ్చని తెలుస్తోంది.
Akanksha
Big Boss
Lip Lock

More Telugu News