Sitara ghattamaneni: మహేశ్‌బాబు కూతురా మజాకా.. ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్‌‌లో తారలా సితార!

viral sitara first add pics on new york times square
  • పీఎంజే జువెలరీకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా సితార
  • తొలి కమర్షియల్‌ యాడ్‌ చేసిన లిటిల్‌ ప్రిన్సెస్‌
  • టైమ్‌ స్వ్కేర్‌పై ఫొటోల ప్రదర్శన
సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు గారాలపట్టి సితార .. తండ్రికి తగ్గ కూతురు. సోషల్‌ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉంటుంది. ఇన్‌స్టాలో ఆమెకు ఫాలోయింగ్‌ కూడా ఎక్కువే. ఇటీవల ‘సారంగదరియా’ పాటకు డ్యాన్స్‌ చేసి వారెవ్వా అనిపించింది.

ఇక పీఎంజే జువెలరీకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా సితార వ్యవహరిస్తోంది. సితార చేస్తున్న తొలి యాడ్‌ను మూడు రోజులు షూట్‌ చేశారని సమాచారం. ఈ నేపథ్యంలో సితార చేసిన తొలి కమర్షియల్‌ యాడ్‌ను ‘సితార కలెక్షన్స్‌’ పేరుతో అమెరికాలోని న్యూయార్క్‌ సిటీలో ప్రఖ్యాత టైమ్‌ స్వ్కేర్‌పై ఆవిష్కరించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లిటిల్‌ ప్రిన్సెస్‌ యాడ్‌ను టైమ్‌ స్వ్కేర్‌పై చూసి మహేశ్‌ అభిమానులు సంతోషపడుతున్నారు.
Sitara ghattamaneni
Mahesh Babu
Sitara Collections
Time square building

More Telugu News