Venus Williams: 43 ఏళ్ల వయసులో వింబుల్డన్ ఆడిన వీనస్ విలియమ్స్ కు చుక్కెదురు

Venus Williams suffers Wimbledon 1R defeat
  • తొలి రౌండ్ లో స్వితోలినా చేతిలో ఓడిన వెటరన్ ప్లేయర్
  • టోర్నీలో మహిళల సింగిల్స్ ఆడిన పెద్ద వయస్కురాలు ఆమెనే
  • మ్యాచ్ ముగిసిన తర్వాత అంపైర్ తో కరచాలనం చేయని వీనస్
ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ లో 43 ఏళ్ల వయసులో 24వ సారి బరిలోకి దిగిన అమెరికా టెన్నిస్ దిగ్గజం వీనస్ విలియమ్స్ కు చుక్కెదురైంది. ఈ టోర్నీ మహిళల సింగిల్స్ లో అతి పెద్ద వయస్కురాలైన వీనస్ తొలి రౌండ్ లోనే ఓడిపోయి నిరాశ పరిచింది. వింబుల్డన్ లో ఐదు సార్లు విజేత అయిన వీనస్ సోమవారం రాత్రి జరిగిన మొదటి రౌండ్ మ్యాచ్ లో 4-6, 3-6తో వరుస సెట్లో ఉక్రెయిన్ కు చెందిన ఎలినా స్వితోలినా చేతిలో పరాజయం పాలైంది. 

తొలి సెట్ లో కోర్టులో జారిపడిన వీనస్ విలియమ్స్ రెండు సార్లు వైద్య చికిత్స తీసుకుంది. మోకాలికి బ్యాండేజీ వేసుకొని ఆట కొసాగించింది. అయితే రెండు సెట్లలో ఏ దశలోనూ స్వితోలినాకు కనీసం పోటీ ఇవ్వలేపోయింది. ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత ఆమె చైర్ అంపైర్ తో కచరాలనం చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
Venus Williams
USA
Wimbledon

More Telugu News