sbi: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. కార్డు లేకుండా అన్ని ఏటీఎంలలో విత్ డ్రాకు అవకాశం

SBI offers cardless cash facility for all bank users
  • ఖాతాదారులకు ఎస్బీఐ నూతన సేవలు
  • ఇప్పటిదాకా ఎస్బీఐ ఏటీఎంలలోనే ఈ అవకాశం
  • యోనో యాప్ ను అప్ గ్రేడ్ చేసిన ఎస్బీఐ

భారత బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్బీఐ తమ ఖాతాదారులకు పలు నూతన సర్వీసులను అందుబాటులోకి తెస్తోంది. ఇందులో ముఖ్యమైనది కార్డు లేకుండా ఏటీఎం నుంచి నగదు తీసుకోవడం. ఇకపై ఏ బ్యాంకు ఏటీఎం నుంచైనా ఎస్బీఐ ఖాతాదారులు కార్డు లేకుండానే నగదును తీసుకునే అవకాశాన్ని కల్పించింది. ఇప్పటిదాకా ఈ సదుపాయం కేవలం ఎస్బీఐ ఏటీఎంలలో మాత్రమే అందుబాటులో ఉంది. ఇప్పుడు అన్ని ఏటీఎంలకు దీన్ని విస్తరిస్తూ బ్యాంక్‌ యాప్‌ ‘యోనో’ను అప్‌గ్రేడ్‌ చేసింది. 

ఇతర బ్యాంకుల ఖాతాదారులు కూడా యూపీఐ లావాదేవీల కోసం యోనో యాప్‌ను వాడుకునేలా ఎస్బీఐ మార్పులు చేసింది. ఇందుకోసం ‘యోనో ఫర్‌ ఎవ్రీ ఇండియన్‌’ థీమ్‌ను తీసుకొచ్చింది. స్కాన్‌, పే, పే బై కాంటాక్ట్స్‌, రిక్వెస్ట్‌ మనీ వంటి సదుపాయాలు దీనిలో ఉంటాయని ఎస్బీఐ వివరించింది.

  • Loading...

More Telugu News