Committee: ఓటర్ జాబితాల పర్యవేక్షణ కమిటీని నియమించిన చంద్రబాబు

Chandrababu appoints new committee to supervise voter lists
  • ఏపీలో మరి కొన్ని నెలల్లో ఎన్నికలు
  • ఈసారి ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న టీడీపీ
  • కీలక కమిటీకి రూపకల్పన చేసిన చంద్రబాబు
  • ఓ ప్రకటనలో వెల్లడించిన అచ్చెన్నాయుడు
ఏపీలో మరి కొన్ని నెలల్లో ఎన్నికలు రానున్నాయి. వచ్చే ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్న తెలుగుదేశం పార్టీ... రాష్ట్రంలో బోగస్ ఓట్లు పెద్ద సంఖ్యలో నమోదు చేస్తున్నారని, అదే సమయంలో అర్హులైన వారి ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపణలు చేస్తోంది. ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని టీడీపీ నేతలు కలిసి ఈ విషయమై ఫిర్యాదు చేశారు. 

ఈ నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఓ కీలక కమిటీకి రూపకల్పన చేశారు. ఎనిమిది మందితో ఓటర్ జాబితాల పర్యవేక్షణ కమిటీని నేడు ప్రకటించారు. 

ఈ కమిటీలో కనకమేడల రవీంద్రకుమార్, వర్ల రామయ్య, పి.కృష్ణయ్య, ఎస్.రాజశేఖర్ (ఇన్చార్జి), పి.కృష్ణమోహన్, వజ్జా శ్రీనివాసరావు, చిరుమామిళ్ల ప్రసాద్, కోనేరు సురేశ్ సభ్యులుగా నియమితులయ్యారు. 

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు 8 మంది సభ్యులతో ఓటర్ జాబితాల పర్యవేక్షణ కమిటీని నియమించినట్టు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు.
Committee
Voter Lists
TDP
Chandrababu
Atchannaidu
Andhra Pradesh

More Telugu News